calender_icon.png 27 December, 2024 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాపైనా హత్యాయత్నం

15-07-2024 01:06:19 AM

టెస్లా అధినేత ఎలాన్ మస్క్

అమెరికా, జూలై 14: యూఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన కాల్పులపై మస్క్ స్పందించారు. ట్రంప్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. తనపై కూడా గత 8నెలల్లో రెండుసార్లు హత్యాయత్నం జరిగిందన్నాడు. నన్ను చంపేందుకు కూడా ఎవరో ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. దయచేసి మీ రక్షణను పెంచుకోండి.. వారు ట్రంప్ కోసం రాగలిగితే మీ కోసం కూడా వస్తారని   ఓ నెటిజన్ మస్క్‌కి సూచించగా.. నేను బాగుండాలని మీరు పడిన ఆరాటం నాకు నచ్చింది అని తెలిపాడు. రిపబ్లికన్ పార్టీకి తన మద్దతు ఉంటుందని తెలిపాడు. ట్రంప్‌పై దాడి ‘అత్యంత అసమర్థత’, ఉద్దేశపూర్వకంగా చేపట్టిన హత్యాయత్నంగా మస్క్ అభివర్ణించారు.