దిస్‌పూర్, సెప్టెంబర్ 2: ‘తృణమూల్ కాం గ్రెస్ (టీఎంసీ)ను పశ్చిమ బెంగాల్‌కే పరిమితమైన పార్టీగా అస్సాం ప్రజలు భావిస్తు న్నారు. ఆ సమస్యకు పరిష్కారం కొనుగొనడం అంత సులభం కాదు. మరోవైపు ఇక్కడ పార్టీ బలోపేతానికి పార్టీ అధ్యక్షురాలైన మమతా బెనర్జీ నుంచి ఎలాంటి మద్దతు లేదు. ఈ కారణాలతో నేను పార్టీ అసోం చీఫ్‌గా రాజీనామా చేస్తున్నాను’ అని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ రిపున్ బోరా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి బహిరంగ లేఖ రాశారు.
పార్టీ బలోపేతం, అంతర్గత సమస్యల గురిం చి మాట్లాడేందుకు మమతా బెనర్జీ అపాయిమెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, అయిన ప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని కుండబద్దలు కొట్టారు. బోరా గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2022లో టీఎంసీలో చేరి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన టీఎంసీని వీడడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ. ఆయన మళ్లీ కాంగ్రె స్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.