శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
కామారెడ్డి (విజయక్రాంతి): శాంతి భద్రతలకు విగాథం కలిగించే రౌడీషీటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పి చైతన్య రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిఎస్పి కార్యాలయంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రౌడీషీటర్లతో సమావేశం నిర్వహించారు. పోలీసులు చెప్పిన పద్ధతిలో నడుచుకుంటూ కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఇటీవల కామారెడ్డి లో జరిగిన పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఉద్దేశంతో ఎస్పీ చైతన్య రెడ్డి రౌడీషీటర్ల కు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఒకవైపు మంచిగానే చెప్తూ మరోవైపు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.