25-02-2025 08:02:10 PM
భద్రాచలం (విజయక్రాంతి): హైదరాబాదులో జరిగిన 7వ స్టేట్ అథ్లెటిక్స్ లో మెన్ కేటగిరిలో భద్రాచలం చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ అత్యంత ప్రతిభకు 3 మెడల్స్ (జావీలిన్, 200మీటర్, త్రిపుల్ జంప్) సాధించి నేషనల్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయిన సందర్భంగా మంగళవారం భద్రాచలం ఎఎస్పీ విక్రాంత్ సింగ్ కుమార్ తన ఛాంబర్ లో ప్రసాద్ ని అభినందించారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కవి పోలీస్ ప్రసాద్ తనకి మెడల్స్ రావడానికి సహకారం అందించిన ఎఎస్పీ విక్రాంత్ సింగ్ కుమార్, సీఐ రమేష్, కోచ్ గిరి రవిరెడ్డి జిమ్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.