17-03-2025 03:34:18 PM
ఎఎస్పీ చిత్తారంజన్
వాంకిడి: పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధ్యమని ఏ ఎస్ పి చిత్తారంజన్ అన్నారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఎస్పీ మాట్లాడుతూ పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కృషి, సమయపాలనను పాటిస్తే విద్య పట్ల పట్టు సాధించవచ్చని సూచించారు. ఉన్నత స్థానాలకు ఎదగాలంటే చదివే ప్రధాన కారణమని పేర్కొన్నారు. లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధనకై ముందుకు సాగాలని సూచించారు. 398 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రశాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నటరాజ్, ఉపాధ్యాయుడు సంతోష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.