04-03-2025 04:21:12 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు(Zaheerabad Mahila Congress President)గా అస్మా తబస్సుమ్ ను నేను ఇస్తా రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు(Istha State President Sunitha Rao) ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమకానికి సహకరించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సుధా, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చంద్రశేఖర్, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.