calender_icon.png 29 November, 2024 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ అడిగితే తిట్లపురాణం!

30-10-2024 02:03:19 AM

  1. దేవుళ్లపై ఒట్లు వేసి కూడా మోసం 
  2. వరంగల్ డిక్లరేషన్ హామీలు ఏమైనయి ?
  3. మూసీ సుందరీకరణకు పైసలున్నయ్ 
  4. రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు లేవు
  5. అవ్వాతాతల పింఛను ఎందుకు పెంచలేదు? 
  6. బతుకమ్మ చీరల పంపిణీ ఏమైంది?
  7. ‘మహాలక్ష్మి’ పథకం ఎటుపాయె?..
  8. వనపర్తిలో రైతు నిరసన సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు

వనపర్తి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయలేకనే నిబంధనల తిట్లు పెట్టిందని, రుణమాఫీ కాక రాష్ట్రంలో ఎంతోమంది రైతులు బలవన్మరణాలకు పాల్ప డ్డారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు.

రైతు రుణమాఫీ అడిగితే సమాధానం చెప్పలేకే కాంగ్రెస్ నేతలు తమపై తిట్ల పురాణం అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. వనపర్తి జిల్లాకేంద్రంలో మంగళవారం మాజీ మంత్రి సింగిరె డ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు నిరసన సభ’లో ఆయన మాట్లాడారు.

ఒక కుటుంబంలో రెండు తరాల వారు ఉండొచ్చని, ఒకవేళ మొదటి తరం వారి రేషన్‌కార్డులో తర్వాతి తరం వారి పేర్లు ఉండొ చ్చన్నారు. తర్వాతి తరం వారు వ్యవసాయం చేస్తూ రుణం తీసుకున్నప్పటికీ, వారికి రేషన్ కార్డు లేకపోతే ఏం చేస్తారన్నారు. వారికి రుణమాఫీ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రుణమాఫీపై మొదటి సంతకం చేస్తామని, నాడు పీసీసీ అధ్యక్షుడి స్థానంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు వందశాతం రుణమాఫీ కాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 20 లక్షల మందికైనా మాఫీ కాలేదన్నారు.

హామీలు ఇచ్చి.. అధికారం చేపట్టి.. ఆ తర్వాత ఆ హామీలను పక్కన పెట్టిన ప్రభుత్వాలను ప్రజలు విశ్వసించరని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో లేనిపోని హామీలు ఇప్పించారన్నారు.

రాష్ట్రం సిద్దించిన తర్వాత ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, పదేళ్ల పాటు ప్రజాసంక్షేమం కోసమే పాటుపడ్డారని కొనియాడారు. కానీ, కాంగ్రెస్ ప్రభు త్వంలో సంక్షేమ పథకాలు బంద్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

ఆడబిడ్డల పెండ్లిళ్లకు రెండు రోజుల ముందే రూ.లక్ష చెక్కు , తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముందు లేనిపోని హామీలు ఇచ్చి, తర్వాత తప్పించుకొనుడు ఎందుకు అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇలాం టి కొర్రీలేవీ లేవని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేశామని గుర్తుచేశారు.

‘మహాలక్ష్మి’ పేరిట మోసం

మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చా రని, అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీకి ఎగనామం పెట్టారని హరీశ్‌రావు మండిపడ్డారు. నెలకు రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తానని నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అవ్వాతాతల కాళ్లు మెక్కారన్నారు. అధికారం వచ్చి ఏడాద కావొస్తున్నా, పింఛ న్ పెంచలేదన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి రూ.వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానంటున్నారని, కానీ రైతులు రైతుభరోసా అడిగితే మాత్రం పైసలు లేవంటున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ.. సీఎం సీటును కాపాడుకొనేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నల్గొండ ప్రాంతంలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయించారని ఆరోపించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, హర్షవర్థన్‌రెడ్డి, బాలరాజు, అంజయ్య యాదవ్, రజిని, ఇంతియాజ్ పాల్గొన్నారు. 

బతుకమ్మ చీరెల పంపిణీ ఏమైంది?

‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త పథకాల సంగతి దేవుడెరుగు.. ఉన్న పా త పథకాలు కూడా బంద్ అయ్యాయి. బీఆర్‌ఎస్ హయాంలో ఏటా మహిళలకు బతుకమ్మ చీరె అందేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీరెల పంపిణీ పూర్తిగా బంద్ అయింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

తమ ప్రభుత్వం లో ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు ఇచ్చామని గుర్తుచేశారు. ఆసుపత్రిలో గర్భిణి ప్రస వం తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చి ఆమెను భద్రంగా, ఉచితంగా వాహనంలో ఇంటివద్ద దించామన్నారు. ప్రస్తుతం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతుబంధు వంటి పథకాలు బంద్ అయ్యాయన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ పేరిట అనేక హామీలను ఇచ్చిందన్నారు. అవి నెరవేర్చలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నమ్మేట్టు లేరని సీఎం రేవంత్ దేవుడి మీద ఒట్లు పెట్టుడు మొదలు పెట్టారన్నారు. 

కురుమూర్తి,లక్ష్మీనరసింహస్వామి, జోగుళాంబ.. ఇలా ఎందరో దేవుళ్లపై ఒట్లు వేశారన్నారు. తర్వాత ఒట్టు తీసి గట్టుమీద పెట్టారన్నారు.