- దశాబ్ద కాలంగా తారుకు నోచుకొని వైనం
- పల్లిమక్త, నాగారం రోడ్డు అధ్వానం
- నిత్యం అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజలు
కోనరావుపేట, జనవరి 18 : ప్రభుత్వా లు మారినా... పాలకులు మారినా ఆ రోడ్డు పరిస్థితి మారడం లేదు. అడుగడుక్కు గుంతలు ఉండడంతో ఆ రోడ్డు వెంట వెళ్లే వాహనదారుల ప్రయాణం నరకప్రాయమ వుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు భయం గుప్పిట్లో ప్రయా ణం సాగిస్తున్నారు.
వేములవాడ నంది కమన్ నుండి కోనరావుపేట మండలం పల్లిమక్త, నాగారం వెళ్ళే రోడ్డంతా గుంతల మయంగా మారింది. గతంలో వేముల వాడ నంది కమాన్ నుండి కోనరావుపేట మండలం మర్తన్నపేట గ్రామం వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధు లు కేటాయించింది. పనులను దక్కించుకు న్న సదరు కాంట్రాక్టర్ ఖమ్మం నుండి సుద్దాల మీదుగా పల్లిమక్త వరకు రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు.
అక్కడి నుండి మర్తన్నపేట గ్రామం వరకు డబుల్ రోడ్డు వేసేందుకు నిధులు సరిపోకపోవడం తో పనులను నిలిపి వేశాడు.దీంతో మళ్లీ అధికారులు నిధుల ప్రతిపాదనలు పంపిం చగా మర్తన పేట నుండి నాగారం గ్రామ శివారు వరకు సింగిల్ తారు రోడ్డు నిర్మా ణానికి రూ .85 లక్షల నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్ పనులను పూర్తి చేశారు.
కాగా నాగారం శివారు నుండి పల్లిమక్త వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర అడుగ డుగునా గుంతలుగా రోడ్డు మారింది. చినుపడితే చాలు రోడ్డు వెంట వెళ్లే వాహన దారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కూడా ఈ రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టకపోవడంతో రెండు గ్రామాల ప్రజ లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మట్టిని పోసిన సంఘటనలు ఉన్నాయి.
ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన ఇప్పటి వరకు ఆ రోడ్డుకు మరమ్మత్తులు ఊసే లేకపోవడంతో ఈ రోడ్డు వెంట వెళ్లే వాహన దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు దుస్థితితో బస్సులు కూడా సరిగా రావడం లేదు దీంతో ఆటోలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోడ్డు వెంట జిల్లా కేంద్రానికి, వేములవాడ రాజ న్న ఆలయానికి వెళ్లేందుకు నిత్యం ఇబ్బం దులు పడుతున్నారు. నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని రమేష్ బాబు సుదీర్ఘంగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే గా కొనసాగిన, ఇదే గ్రామానికి చెందిన విద్యాసాగర్‌రావు కేంద్ర హోమ్ శాఖ సహా య మంత్రిగా, మహారాష్ర్ట మాజీ గవర్నర్గా పదవులు చేపట్టినప్పటికీ ఈ రోడ్డు ఇంత అద్వానంగా ఉన్న పట్టించుకోకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటీవల కాలంలో నాగారానికి వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం సైతం రోడ్డు మరమ్మత్తులు చేపడతామని హామీలి చ్చిన ఇప్పటివరకు చేపట్టకపోవడంపై రెండు గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించి తమ రోడ్డు కు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.
నరకప్రయాణం..
ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిం ది. ఆటోలు నడపాలంటే భయంతో వెళ్లాల్సి వస్తుం ది. ఎప్పుడు ఏ గుంతలో పడి ఏం జరు గుతుందోనని ఆందోళన కలుగుతుంది. మా రోడ్డుకు వెంటనే మరమ్మతు చేపట్టి తారు రోడ్డు వేయాలి.
శ్రీనివాస్, ఆటో డ్రైవర్ పల్లిమక్త