16-03-2025 12:04:33 AM
పెళ్లున తర్వాత ఏళ్లు గడిచే కొద్దీ చాలామంది దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్యత తగ్గిపోవడం మనం చూస్తుంటాం. పెళ్లున కొత్తలో ఉన్నట్లు సమయం కేటాయించకపోవడం, ఆసక్తి లేనట్లు ఉండటం, భాగస్వామి పట్ల నిర్లక్ష్యం చూపించడం చేస్తుంటారు. దీన్నే బ్రెడ్‌క్రంబింగ్ రిలేషన్‌షిప్ అంటారు. భాగస్వామి అస్థిరమైన ప్రవర్తనను బట్టి అనుబంధంలో బ్రెడ్‌క్రంబింగ్‌ను గుర్తించాలంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా ఇలాంటి వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు. భాగస్వామి సర్దుకుపోతున్నా వారు సహించలేరు. పదే పదేవారి ప్రణాళికల్ని వాయిదా వేస్తూ అవతలి వారిని నిరాశ పరుస్తుంటారు. పొరపాటున తమదైనా, భాగస్వామిదైనా.. భాగస్వామినే నిందిస్తుంటారు. అవతలి వారు స్వీయ అపరాధ భావనకు లోనయ్యేలా ప్రవర్తిస్తుంటారు.
భాగస్వామిపై ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తూ, అవసరం ఉన్నా లేకపోయినా వారిని ప్రశంసిస్తూ తమ పనులు పూర్తిచేసుకుంటుంటారు. పని పూర్తున తర్వాత మళ్లీ ఎప్పటిలాగే ప్రవర్తిస్తుంటారు. తమ మోసపూరిత ప్రవర్తన భాగస్వామి పసిగట్టారని తెలిసినా, అనుమానమొచ్చినా..
అప్పటికప్పుడు మారిపోయినట్లుగా నటించి జాగ్రత్త పడుతుంటారు. భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు.. అసలు వాళ్లెందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి.ఈ క్రమంలో పొరపాటు ఎవరిదైనా నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా సరిదిద్దుకుంటేనే ఫలితం ఉంటుంది.