calender_icon.png 15 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏషియన్ పెయింట్స్ లాభంలో క్షీణత

18-07-2024 12:08:49 AM

న్యూఢిల్లీ, జూలై 17: ఎషియన్ పెయింట్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 24.64 శాతం క్షీణించి రూ. 1,187 కోట్ల వద్ద నిలిచింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 1,575 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. లోక్‌సభ ఎన్నికలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఆదాయ, లాభాలు క్షీణించాయని ఎషియన్ పెయింట్స్ తెలిపింది. ఈ క్యూ1లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.9,182 కోట్ల నుంచి రూ.8,970 కోట్లకు తగ్గింది.