calender_icon.png 19 January, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసియా కప్ విజేత శ్రీలంక

29-07-2024 12:02:39 AM

ఫైనల్లో భారత్‌పై విజయం

దంబుల్లా: మహిళల ఆసియాకప్‌ను ఆతిథ్య శ్రీలంక జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న లంక తొలిసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 165 పరుగులు చేసింది. భారత స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మరోసారి మెరవగా..  రిచా ఘోష్ (14 బంతుల్లో 30), జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో కవిశా దిల్హరీ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది.