రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట పురపాలక సంఘం హైదరాబాద్ వెళ్లే దారిలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ షట్టర్ లో శుక్రవారం ఏఎస్ఐ రవీందర్, తుజాల శ్రీనివాస్ గౌడ్, అన్వర్ అలీ ఆధ్వర్యంలో నూతన హీరో ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూం నిర్వాహకులు అన్వర్ అలీ మాట్లాడుతూ.. రామాయంపేట ప్రాంతంలో ఎలక్ట్రికల్ స్కూటీ షోరూమ్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. ఈ షోరూమ్ లో రైతులకు, కాలేజీ విద్యార్థులకు, సామాన్య ప్రజలకు అన్ని రకాల వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటి ధర 42 వేల నుండి 72 వేల వరకు ఉన్నాయని తెలిపారు.
ఈ వెహికల్స్ కు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదని హెల్మెట్ మాత్రమే ధరించి ఈ వాహనాలు నడుపుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వెహికల్స్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 70 కిలోమీటర్ల వరకు నడుస్తాయని తెలిపారు. ముందు వచ్చేటివన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ దీని పట్ల ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా నడపవచ్చని పేర్కొన్నారు. రామాయంపేట ప్రాంతంలో వెహికల్స్ ప్రజలకు సరసమైన ధరలకు లభించునని కొనుగోలు చేసి వీటిని స్వేచ్చగా నడుపుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ ఏఎస్ఐ రవీందర్, ఎలక్ట్రికల్ షోరూం నిర్వాహకులు అన్వర్ అలీ, మౌనిక తుజాల శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్రికల్ వాహన షోరూం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.