అవమానం జరగొద్దనే వీడ్కోలు: అశ్విన్ తండ్రి
చెన్నై: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కో లు పలికిన భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గురువారం స్వదేశంలో అడుగుపెట్టాడు. బుధవారం బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ముగిసిన వెంటనే ఆటకు గుడ్‌బై చెప్పిన అశ్విన్ బోర్డర్ ర్ సిరీస్ మధ్యలోనే వీడ్కోలు పలకడం ఆశ్చర్యపరిచింది. రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణమే అశ్విన్ కుటుంబంతో కలిసి స్వస్థలం చెన్నైకి చేరుకున్నాడు. అశ్విన్‌కు తన ఇంటి వద్ద స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
కుమారుడిని చూసిన తండ్రి రవిచంద్ర న్ అతడిని హత్తుకొని ముద్దుల వర్షం కురిపించారు. మీడియాతో మాట్లాడేందుకు అశ్విన్ ఇష్టపడలేదు. ‘నా బిడ్డ అవమానం జరగకముందే తనంతట తానుగా తప్పుకుంటే మంచిదని భావించాడు. అందుకే అనూహ్యంగా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు’ అని అశ్విన్ తండ్రి రవిచంద్రన్ పేర్కొన్నారు. తండ్రి వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా అశ్విన్ ఖండించాడు. ‘అవమానం తదితర కారణాలు ఏం లేవు. రిటైర్మెంట్ తట్టుకోలేక నా తండ్రి అలాంటి వ్యాఖ్య లు చేశాడు. మా నాన్న వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. కొంతకాలం ఒంటరిగా వదిలేయండి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు.