చెస్ జట్టు కొనుగోలు చేసిన ఆఫ్‌స్పిన్నర్
న్యూఢిల్లీ: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చదరంగంలో అడుగు పెట్టనున్నాడు. గ్లోబల్ చెస్ లీగ్ టోర్నీలో భాగమైన అమెరికన్ గాంబిట్స్ ఫ్రాంచైజీకి అశ్విన్ సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. కొత్త టీమ్ అయిన అమెరికన్ గాంబిట్స్ చింగారీ గల్ఫ్ టైటాన్స్ స్థానంలో గ్లోబల్ చెస్ లీగ్‌లో అడుగుపెట్టింది. అశ్విన్‌తో పాటు ప్రచుర పీపీ, వెంకట్ కె నారాయణలు అమెరికన్ గాంబిట్స్ కో ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు లండన్ వేదికగా గ్లోబల్ చెస్ లీగ్ రెండో ఎడిషన్ జరగనుంది. ఈ లీగ్‌లో అమెరికన్ గాంబిట్స్ సహా మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి.
ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్, పీబీజీ అలాస్కన్ నైట్స్, గాంగ్స్ గ్రాండ్‌మాస్టర్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, ముంబా మాస్టర్స్ ఉన్నాయి. తొలి ఎడిషన్‌లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ విజేతగా నిలిచింది. ‘చదరంగం క్రీడలో అమెరికన్ గాంబిట్స్‌ను పరిచయం చేయడం థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. సహ యజమానిగా జట్టు జర్నీని ఆస్వాదించడంతో పాటు సక్సెస్ కోసం నా వంతు కృషి చేస్తా’ అని అశ్విన్ తెలిపాడు. తనకు చెస్ క్రీడ అంటే చాలా ఇష్టం అని పలు సందర్బాల్లో అశ్విన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.