calender_icon.png 28 September, 2024 | 4:56 PM

అశ్విన్ ఆరేశాడు

23-09-2024 12:00:00 AM

తొలి టెస్టు భారత్‌దే

సెంచరీతో పాటు ఆరు 

వికెట్లతో చెలరేగిన చెన్నై చిన్నోడు

  1. చేతులెత్తేసిన బంగ్లా బ్యాటర్లు
  2. నాలుగు రోజుల్లోనే ఖేల్ ఖతం

బంగ్లాతో జాగ్రత్త.. వారు పసికూనలు.. కాదు పంజా విప్పిన పులుల్లా మారారు. 20 రోజుల నుంచి వినిపిస్తున్న మాటలివి. కానీ ఆదివారంతో ఆ జాకీలు మొత్తం హుష్‌కాకీ అయ్యాయి. బెదురనేదే లేకుండా విర్రవీగిన బంగ్లా నడ్డి విరిగింది. పాక్‌ను ఓడించినంత వీజీగా ఇండియాను ముప్పుతిప్పలు పెట్టలేమని ఆ జట్టుకు క్లియర్ కట్‌గా తెలిసొచ్చింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇండియా మరింత చేరువయింది. లోకల్ బాయ్ అశ్విన్.. మొదట బ్యాటుతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతితోబంగ్లాను ముప్పు తిప్పలు పెట్టాడు.  

1 - ఇప్పటి వరకు భారత్ 580 టెస్టులాడగా.. 179 విజయాలు, 178 పరాజయాలు, 222 డ్రాలు చేసుకుంది. ఒకే ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది.

చెన్నై: చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా జట్టు బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో ఘన విజ యం సాధించింది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌ను వారి సొంత గడ్డ మీద 2-0 తేడా తో ఓడించామన్న బంగ్లా ఆనందాన్ని రోహిత్ సేన ఆవిరి చేసేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే చేతులెత్తేసిన బంగ్లా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా పోరాడలేక చతికిలపడ్డారు.

సెంచరీ హీరో అశ్విన్ స్పిన్ మాయాజాలానికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. 5 రోజుల మాట దేవుడెరుగు.. కనీసం నాలుగో రోజు లంచ్ విరామం వరకైనా నిలవలేకపోయారు.  సెం చరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండో టెస్టు ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది. 

అదే జోరు కానీ.. 

బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే అందరూ భారత్‌కు జా గ్రత్తలు చెబుతూ సూచనలు చేశారు. అందుకు తగ్గట్లుగానే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో వెంటవెంటనే భారత వికెట్లు నేలకూ ల్చి ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ రవిచంద్రన్ అశ్విన్ (113), జడేజా (86) ఇద్దరూ అడ్డుగోడలా నిలవడంతో బంగ్లా పప్పులు ఉడ కలేదు. వీరిద్దరి పోరాటంతో ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగుల స్కోరు చేసింది. 

అదే తడ ‘బ్యాటు’

మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తడ బ్యాటుకు గురైంది. స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా, కొత్త కుర్రాడు ఆకాశ్‌దీప్ నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్ కేవలం 149 పరుగులు మాత్రమే చేయగల్గింది. వెంటనే రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ గిల్(119*), పంత్(109) సెంచరీలతో చెరేగడంతో స్పీడ్‌గా పరుగులు చేసింది. 287/4 వద్ద రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి బంగ్లాకు బ్యాటింగ్ అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని బంగ్లాదేశ్‌కు 515 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కానీ బంగ్లా మాత్రం 234 పరుగులకే చేతులెత్తేసింది. 

కూర్పులో మార్పుల్లేవ్

బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా ఆడే రెండో టెస్టు కోసం మొదటి టెస్టులో తలపడిన జట్టే రెండో టెస్టులో కూడా ఆడుతుం దని బీసీసీఐ ప్రకటించింది. దులీప్ ట్రోఫీలో సత్తా చాటిన ఆటగాళ్లకు అవకాశం వస్తుందని అనుకుంటే వారికి నిరాశే మిగిలింది. 

అశ్విన్ ఆల్‌రౌండ్ షో.. 

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన విలువేంటో చాటుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నపుడు బ్యాటింగ్‌కు దిగిన ఈ చెన్నై కుర్రోడు ఎవరూ ఊహించని విధంగా జట్టును సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో తన స్పిన్ మాయాజాలంతో ఆరు వికెట్లు నేలకూల్చి బంగ్లాకు ఓటమిని మరింత ముందుకు తీసుకొచ్చాడు. 

జడ్డూ అదుర్స్.. 

దులీప్ ట్రోఫీలో అర్ధ సెంచరీతో సత్తా చాటిన అక్షర్‌ను కాదని సీనియర్ ఆల్‌రౌండర్ జడేజాను తీసుకోవడం సరైన నిర్ణయమేనా అని అంతా అన్నారు. కానీ తన విలువేంటో జడ్డూ మరోమారు చాటి చెప్పా డు. బ్యాటుతో, బంతితో బంగ్లాకు చుక్కలు చూపించాడు.  

ఫాఫం బంగ్లా.. 

బంగ్లా ఆటగాళ్లు బెబ్బుల్లా గర్జిస్తారని అనుకుంటే పిల్లుల్లా తోక ముడుచుకుని ఓటమిని ఆహ్వానించారు. మూడో రోజు వరకు కాస్తో కూస్తో పోటీనిచ్చిన బంగ్లా ఆటగాళ్లు.. నాలుగో రోజు ఇక మా 

వల్ల కాదంటూ చేతులెత్తేశారు. అశ్విన్, జడేజాల మాయాజాలానికి తట్టుకోలేక బంగ్లా బ్యాటర్స్ తల్లడిల్లారు.