అశ్వరావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలోనే ముందంజలో ఉందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు ఆదివారం తెలంగాణ సంఘటనా పర్వ్ -2024 కార్యక్రమం లో భాగంగా ఈ రోజు అశ్వారావుపేట లో మండల అధ్యక్షులు బండారు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ స్థాయి సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరైనారు. ఈ సందర్భంగా పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వపురావు పేట మండలం సభ్యత్వాలలో ముందంజలో ఉందని అదేవిధంగా బూత్ కమిటీల్లో శక్తి కేంద్ర కమిటీల్లో ముందు వరుసలో ఉండాలి అని అన్నారు. బీజేపీ పార్టీ అంటేనే సంస్థాగ నిర్మాణం అని ఏ రాజకీయ పార్టీ కి లేని విధంగా బూత్ స్థాయి లో కార్యకర్తలు ఉన్న పార్టీ కేవలం బీజేపీ అని అన్నారు.
బీజేపీ పార్టీలోనే పని చేసే క్రింది స్థాయి కార్యకర్తలను కూడ గుర్తించి మంచి పదవులు ఇచ్చే పార్టీ బీజేపీనే అని అన్నారు. సభ్యత్వ నమోదు -2024 లో భాగంగా ప్రజలు స్వచ్చందంగా బీజేపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు అని అన్నారు. రాబోవు కాలంలో ఈ రాష్ట్రములో కూడా బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని దాని కోసం ఇప్పటి నుండి కార్యకర్తలందరు సమిష్టిగా పని చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొలిక పోగు ముసలయ్య, జిల్లా కార్యదర్శి మద్దాల దేవి, ఓబీసీ మోర్చ స్టేట్ కమిటీ సభ్యుడు తాళ్ల మణికంఠ, మండల కార్యదర్శి జల్లిపల్లి అరవింద్, కలకోటి కృష్ణ, చిట్టి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.