08-04-2025 12:29:44 AM
ఖైరతాబాద్, ఏప్రిల్ 7: ఐఐఎంసీ కళాశాల సభా ప్రాంగణంలో యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, ఐఐఎంసీ కళాశాల, సాధన సాహితీ స్రవంతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలుగు వెలుగు కార్యక్రమం ఆరవ సమావేశం సోమవారం జరిపారు. సభాధ్యక్షుడు, వ్యవ స్థాపక సమావేశకర్త ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ.. తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమాల నిర్వహణకు ఎంతోమంది ఆర్థిక సహకారం అందజేస్తున్నారని, వారి మక్కువకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్య ప్రసంగికుడు ఆర్ష ధర్మ ప్రచారకుడు డా.చూడామణి రామాయణ కృతులు సాహితీ సౌరబాలు అనే అంశంపై వివరించారు. సాధన సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షుడు సాధన నరసింహాచార్యమాట్లాడుతూ.. అవధాన కార్యక్రమంలో అవధాని చిన్న వయసులో ఈ అవధానంను చేపట్టడం నేటి విద్యార్థులకు ఆదర్శమన్నారు.
ఇందులో పృచ్ఛకులుగా ఆచార్య ఫణీంద్ర, ఎం దత్తాత్రేయశర్మ, సి.రామకృష్ణారావు, ఎం.లక్ష్మీమానస, వల్లీ ఫణీంద్ర, లలితా పరమేశ్వరి, కె.వి.ఎన్‌ఆచార్య, ఎం.సూర్యనారాయణ మూర్తి, కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్, రవీంద్ర, నవీన్, నారాయణరెడ్డి, రామకృష్ణ, శ్యామ్ పాల్గొన్నారు.