యోగి అణిమాది అష్టసిద్ధులను పొందుతాడు. ‘అణిమ’ అంటే సూక్ష్మరూ పం పొందడం, ‘మహిమ’ అంటే పెద్ద రూపం ధరించ డం. హనుమంతుడు ఈ సి ద్ధులను సీతాన్వేషణకు వె ళ్ళినప్పుడు లంకలో ఉపయో గించాడు. ఆయన సిద్ధపురుషుడు. ‘లఘిమ’ అంటే బా గా తేలికగా అవడం, ‘గరిమ’ అంటే బాగా బరువుగా అవ డం. ‘ప్రాప్తి’ అంటే వ్రేలుతో చంద్రుణ్ణి తాకడం, ‘ప్రాకామ్యం’ అంటే ఏది కోరు కుంటే అది పొందడం, ఎత్తు కు ఎగరడం, జలంలో ముని గి ఉండడం వంటి శక్తులు పొందడం. ‘వశిత్వం’ అంటే ప్రకృతి శక్తులను, మానవులను కూడ తన వశం చేసుకోవడం, ‘ఈశిత్వం’ అంటే ఆ శక్తులకు అధిపతిగా ఉండడం. ఇవీ అష్టసిద్ధులు.
ఇవి కాక ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, మనో వేగంతో ఎక్కడికైనా వెళ్ళగలగడం, భూత భవిష్యత్తులను తెలుసుకోగలగడం, పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఉండడం, కామరూప గ్రహణం చేయగలగడం, సర్వత్రా స్వేచ్ఛా విహారం చేయగలగడం, ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో అనేక రూపాలలో ఉండడం వంటి అనేక అద్భుత శక్తులను యోగి పొందగలడు.
ఈ శక్తులను గురించి చెప్పి ఇవన్నీ (ఇంద్రియ నిగ్రహం తప్ప) ప్రపంచాన్ని వశం చేసుకోవడానికి ఉపకరిస్తాయే తప్ప నిర్భీజ సమాధికి ఉపయోగించవని, వీటిమీద వైరాగ్యం పొందిన వానికే ప్రకృతి బంధాలు తొలగి కైవల్యం లభిస్తుందని ‘యోగ దర్శనం’ పేర్కొంది. యోగం ధ్యేయం ఈ శక్తులను పొందడం కాదని, ఇవి మోక్షానికి ప్రతి బంధకాలేనని, వీటిని ఉపయోగించ కూడదని కూడా ‘యోగ దర్శనం’ వారిస్తున్నది.
‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో, ‘వేదాంత పరిభాష’ నుంచి..
- కళానిధి సత్యనారాయణ మూర్తి