calender_icon.png 4 February, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షునిగా అశోక్ రాజ్

03-02-2025 10:46:42 PM

పిట్లం (విజయక్రాంతి): పిట్లం మండల కేంద్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ ప్రెసిడెంట్ కుమ్మరి యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రెసిడెంట్ గా చిల్వెరి అశోక్ రాజ్ ను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అశోక్ రాజ్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పగించిన జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు కుమ్మరి యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ బంధుమిత్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని, వారందరికీ అందుబాటులో ఉంటూ, పదవికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి సభ్యులు, స్థానిక నాయకులు, మరియు బీసీ బంధుమిత్రులు పాల్గొన్నారు.