24-02-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ కోదండరాం
సిద్దిపేట, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై అశోక్ కుమార్ ను గెలిపించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కాసిం ఈ కార్యక్రమంలో కోదండరాం పిలుపునిచ్చారు. తమ పార్టీ పక్షాన అశోక్ కుమార్ కు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడారు.
ఉపాధ్యాయుల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న అశోక్ కుమార్ ఎమ్మెల్సీగా గెలిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వాలకు పై ఒత్తిడి తెచ్చి ఉద్యమించిన నేపథ్యం కలిగిన అశోక్ కుమార్ ఉపాధ్యాయులందరికీ సుపరిచితుడని సూచించారు. అభ్యర్థి అశోక్ కుమార్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు విద్యా వ్యాపారులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైతే జరిగే నష్టాన్ని ఉపాధ్యాయులు భరించాల్సి వస్తుందని సూచించారు .
ఏనాడు ఉపాధ్యాయుల సమస్యల పట్ల స్పందించని వ్యాపారవేత్తలు ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడం హేయమైన చర్యగా వివరించారు. 317 జీవో కేజీవీబీ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం దిశగా తన వంతు కృషి చేస్తానని ఉపాధ్యాయులకుగా పనిచేస్తానని వెల్లడించారు సమావేశంలో టిపిటీఎఫ్ నాయకులు, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.