calender_icon.png 21 January, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటగుళ్ళలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

17-07-2024 12:09:45 PM

భారీగా తరలివచ్చిన భక్తులు

స్వామివారికి పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ

గణపురం: భూపలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కాకతీయ కళాక్షేత్రం కోటగుళ్లలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఘనంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటగుళ్ళ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం, గణపతి, నందీశ్వర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.