మంచిర్యాల, విజయక్రాంతి: నస్పూర్ పట్టణం రాంనగర్ లోని శ్రీశ్రీశ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి దేవాలయంలో ఆదివారం ఆషాడ మాస బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమిళ్ళ వేణు, అమ్మవారి బోనాలను ఎత్తుకొని సీసీసీ కార్నర్ నుండి ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేరుకొని బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఆషాడ మాసంలో చివరి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, స్థానిక కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.