17-03-2025 08:08:58 PM
మందమర్రి (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... ఆశ వర్కర్లకు గౌరవ వేతనంతో పాటు పదోన్నతి, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.