calender_icon.png 4 March, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన.. పోలీసుపై చేయి

09-12-2024 03:24:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయం వద్ద సోమవారంనాడు ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్ల జీతం 18వేలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మేరకు 18వేల వేతనాలు పెంచాలని కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు ఏసీపీ శంకర్ ను చుట్టుముట్టారు. దీంతో ఆశా కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపతప్పడంతో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టు చేసి అక్కడి నుంచి స్థానిక పీఎస్ కు తరలించారు. ఆశా వర్కర్లను పోలీస్ వ్యాన్ ఎక్కిస్తున్న తరుణంతో ఓ మహిళ సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ పై చేయి చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.