calender_icon.png 19 March, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాల్సిందే

18-03-2025 12:00:00 AM

తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డికి వినతిపత్రం అందజేత

రాజాపూర్ మార్చి 17: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం రాజాపూర్ మండల తహశీల్దార్ విద్యాసాగర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు సావిత్రి, అమృత  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ వర్కర్లకు 18 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పాటయి 15 నెలలు గడిచిపోయిన ఆశ వర్కర్లకు ఇప్పటివరకు వేతనాలు పెంచలేదన్నారు.

ఆశా వర్కర్లకు పని భారాన్ని పెంచి, పారితోషికం పేరుతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఈ ప్రభుత్వం వెంటనే ఆశల సమస్యల పైన యూనియన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.