నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఆశ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని ఆశ వర్కర్ల సంఘ సిఐటీయు ఆధ్వర్యంలో బుధవారం ఆశ వర్కర్లు కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పని చేస్తున్న ఆశ వర్కర్లు అధికారులు ప్రభుత్వం వైకరిని నిరసిస్తు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ భవనం ప్రధాన గేటు ముందు భైఠాయించి పెండింగ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఆశ వర్కర్లను ప్రభుత్వం వివిధ సర్వేల్లో వాడుకుంటున్న పనికి సంబందించిన డబ్బులు ఇవ్వకపోవడంపై వారు మండిపడ్డారు. జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ.. 2023 నుండి సర్వేలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయని అన్నారు. వెంటనే వాటిని విడుదల చేయాలని వారు డింమాడ్ చేశారు. లేకుంటే ప్రభుత్వ కార్యక్రమాలను చేపట్టబోమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోశెట్టి, గంగామణి, ఇంద్రమాల, చంద్రకళ, మౌనిక తదితరులు ఉన్నారు.