calender_icon.png 11 January, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి

11-01-2025 01:28:41 AM

*-ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా

నారాయణపేట, జనవరి 10(విజయ క్రాంతి): ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఈ అసెంబ్లీ సమావేశం లోని నిర్ణయించి అమలు చేయాలని సిఐటి యు జిల్లా కార్యదర్శి బాల్ రామ్ ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే శ్చిట్టెం పర్నిక రెడ్డి నివాసం సివిఆర్ భవన్ కు  చేరుకొని ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో  వారు ప్రసంగిస్తూ ప్రజల ఆరో గ్యాలను కాపాడుతున్న ఆశా కార్యకర్తల పని కి తగ్గ వారితోషికం  అంటూ అతి తక్కువ వేతనం ఇస్తూ ఆషాలను వెట్టిచాకి గురి చేస్తున్నారని విమర్శించారు. పిఎఫ్ ఈఎస్‌ఐ ప్రమాద భీమా వంటి చట్టబద్ధమైన సౌక ర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఏఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశలకు పేమెంట్ పోస్ట్లు కనిపించాలని ఏఎన్‌ఎం ప్రమోషన్లు కల్పించాలని ఏఎన్‌ఎం పోటి పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత 15 రోజుల సమ్మె హామీలను మరియు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశాల సమస్యలను వెంట నే పరిష్కరించాలన్నారు.

ఈ ధర్నాకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అంజిలయ్య గౌడ్  మద్దత్తు  తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సదాశివ రెడ్డి గారికి వివిధ డిమాండ్లతో కూడుకున్న వినతిపత్రం అందజేశారు.

అయన స్పందిస్తూ సమస్యలన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనివెళ్తానని వేతనం పెంచే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకపోవాలని ఎమ్మెల్యేను కోరతానని ఆయన ఆశలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నేతలు  అనురాధ, ఉమాదేవి, రాధిక, భాగ్యమ్మ, రేణుక,జ్యోతి మౌనిక, శశి కళ, అనురాధ, నాగమణి, రాధిక, వంద మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.