18-03-2025 12:15:24 AM
కొండాపూర్ మార్చ్ 17 : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18000 గా వేతనం నిర్ణయించాలని కొండాపూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం తాసిల్దార్ అనిత కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
సందర్భంగా ఎస్ బాబురావు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఆశా వర్కర్లకు 18000 వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న నేటికీ వేతనాలు పెంచలేదన్నారు.
ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు, గత ప్రభుత్వం ఆమె ప్రకారం ప్రస్తుతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు, ఏఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తిచేసిన ఆశలకు ఏఎన్‌ఎం పోస్టుల్లో ప్రమోషన్ కల్పించాలని కోరారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలి, ఇస్తున్న పారితోషకాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ఆశా వర్కర్ల పట్ల రేవంత్ సర్కార్ మొండివైఖరి సరైనది కాదని అన్నారు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయాలని ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు తుల్జమ్మ, అనిత, అమృత, అనంత తదితర ఆశ వర్కర్లు పాల్గొన్నారు.