20-02-2025 12:00:00 AM
ప్రముఖ గాయని ఆశాభోస్లే మనవరాలు జనై బోస్లే తాజాగా భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ తో కలిసి ఓ డ్యూయెట్ సాంగ్‌ను ఆలపించింది. ఈ పాటను ఆలపిస్తున్న వీడియోను సిరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జునై భోస్లే తాజాగా మ్యూజిక్ ఆల్బమ్‌లోని ‘కెహందీ హై’ పాటను సిరాజ్‌తో కలిసి ఆమె పాడింది.
దీనిని నెట్టింట షేర్ చేసిన సిరాజ్.. “మన కలల్ని నెరవేర్చుకునేందుకు కారణమైన వ్యక్తి కోసం ఈ పాట. నువ్వెప్పటికీ ది బెస్ట్” అంటూ జనైపై ప్రశంసలు కురిపించాడు. కొద్ది రోజుల క్రితం జనై భోస్లే, సిరాజ్‌లు ప్రేమలో ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.
జనై పుట్టినరోజు వేడుకలకు సైతం ఆయన హాజరవడంతో రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. వీటిపై స్పందించిన సిరాజ్ ఆమె తనకు చెల్లెలి లాంటిదని తెలిపాడు. “జనై వంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేనెక్కడా ఉండను. నక్షత్రాలలో చంద్రుని మాదిరిగా వెయ్యి మందిలో జనై ఒకరు”అని చెప్పి రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.