calender_icon.png 17 March, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తల ఆందోళన

17-03-2025 04:39:18 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని ఆశా కార్యకర్తలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్త సమ్మక్క మాట్లాడుతూ.... ఆశా కార్యకర్తలు సమస్యలపై గతంలో 15 రోజులు నిరవధిక సమ్మెకు దిగితే ప్రభుత్వం పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలపై రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 19న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

రూ 18 వేల వేతనంతో పాటు 50 లక్షల ఇన్సూరెన్స్, రూ 50 వేల మట్టి ఖర్చులు ప్రతి ఆశా కార్యకర్తకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుతో పాటు ప్రతినెల పెట్టే టార్గెట్స్ ను రద్దు చేయాలని కోరారు. పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం పూర్తిచేసిన ఆశలకు ప్రమోషన్లు కల్పించి ఏఎన్ఎం ఉద్యోగాలను కేటాయించాలన్నారు. ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల మెడికల్ సెలవులను ఇవ్వాలన్నారు. లెప్రసి సర్వే పెండింగ్ డబ్బులతో పాటు పల్స్ పోలియో డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఆశా కార్యకర్తలకు పనులు డ్యూటీలను కేటాయించి సమయంలో వెహికల్ తో పాటు సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని ప్రజావాణిలో తహసీల్దార్ జ్యోత్స్నకు అందజేశారు.