మహబూబ్‌నగర్, జనవరి 10 (విజయక్రాంతి) : ఆశ కార్యకర్తల సమస్యలను పరిష్కరించా లని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ ఆశలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆశాల సమ్మె; శిబిరాలకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ 18000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, పారితోషకం, లేని ఏ పనులు చేయించ మని, పిఎఫ్ ఈఎస్‌ఐ అమలు పరుస్తామని, మిగతా డిపార్ట్మెంట్ల మాదిరిగా ప్రమోషన్స్ సౌక ర్యాలు కల్పిస్తామని, ప్రమాద బీమా కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా కలిపి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ చేస్తామని, మట్టి ఖర్చులకు 50,000 ఇస్తామని, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
వాటిని అమలు చేయాలని అడుగుతున్నామని పేర్కొన్నారు.;అనంతరం ఎమ్మెల్యే పిఏ భరత్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి చంద్రకాంత్, ఆశా యూనియన్ నాయకులు సౌజన్య, సునీత, అనురాధ, మంజుల, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.