calender_icon.png 26 March, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా కార్యకర్తలు అరెస్ట్

24-03-2025 10:37:52 AM

కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ తరలింపు

కామారెడ్డి,(విజయక్రాంతి): తమ సమస్యలు పరిష్కారం కోరుతూ శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం ఉదయం కామారెడ్డి కొత్త బస్టాండ్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ... న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం పిలుపుమేరకు హైదరాబాద్ తరలి వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చిన ఆశ కార్యకర్తలను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసిన ఆశ కార్యకర్తలను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఆశా కార్యకర్తలను పోలీసులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ తమ వాహనాల్లో తరలించారు.