calender_icon.png 24 April, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది కేవలం రాజకీయ అంశం కాదు.. జాతీయ సమస్య: అసదుద్దీన్ ఒవైసీ

24-04-2025 06:10:48 PM

హైదరాబాద్: జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) జరిగిన నేపథ్యంలో అఖిలపక్ష భేటీపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(AIMIM MP Asaduddin Owaisi) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ భేటీపై నిన్న రాత్రి మంత్రి కిరణ్ రిజిజు(Union Minister Kiren Rijiju)తో మాట్లాడాను అని, ఐదు నుంచి పది ఎంపీలున్న పార్టీలతో భేటీ యోచన ఉన్నట్లు చెప్పారని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. తక్కువ ఎంపీలున్న పార్టీలను ఎందుకు ఆహ్వానించరని అడిగా... అందరిని పిలిస్తే భేటీకి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు.

ఇది కేవలం బీజేపీ లేదా ఇతర పార్టీల అంతర్గత భేటీ కాదు అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అఖిలపక్ష భేటీ అనే గట్టి సందేశం ఇవ్వాలని తెలిపారు. అఖిలపక్షాల సూచనలకు ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) మరో గంట సమయం కేటాయించలేరా..? మీ సొంత పార్టీకి పూర్తి మెజార్టీ లేదని ఎంపీ అసదుద్దీన్ ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదు.. జాతీయ సమస్య అని సూచించారు. నిజమైన అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రధాని మోడీని కోరుతున్నానని, పార్లమెంట్ లో ఎంపీలున్న అన్ని పార్టీలను భేటీకి ఆహ్వానించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.