calender_icon.png 1 May, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2021 నుంచి నేను కూడా కులగణన డిమాండ్ చేస్తున్నా

30-04-2025 07:29:00 PM

కులగణన.. అత్యవసరం

2021 నుంచి కులగణన డిమాండ్ చేస్తున్నా: ఒవైసీ

విద్య, ఉపాధిలో న్యాయమైన వాటా దక్కాలి

హైదరాబాద్: కులగణనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ(AIMIM Chief Asaduddin Owaisi) అన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ .. ఇది అత్యవసరమని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. 2021 నుంచి తాను కూడా కులగణన డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కులగణన అమలులో నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)ని అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. దళిత ముస్లింలకు ఎస్సీ హోదాను భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) వ్యతిరేకించిందని ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించిందని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధిలో న్యాయమైన వాటా దక్కాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.