హైదరాబాద్: ఎక్కువ మంది సంతానం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ అంటున్నారు.. అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే రాద్ధాంతం చేసేవారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. దక్షిణ భారత్ లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు గుర్తించారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతోందని తెలిపారు. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతోందన్నారు. బాగా పనిచేసిన రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షేస్తే ఏం లాభం..? అని ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నించారు. అటు బీఆర్ఎస్ పార్టీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతకాలు తమదగ్గర ఉన్నాయన్న ఆయన బయటపెడితే ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడతారని చెప్పారు.