calender_icon.png 5 April, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బిల్లుపై సుప్రీంను ఆశ్రయించిన అసదుద్దీన్

05-04-2025 02:07:52 AM

  • బిల్లు చట్టానికి విరుద్ధమని పిటిషన్ దాఖలు
  • బిల్లు ఏకపక్షంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ పిటిషన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులోని నిబంధనలు  చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని..  ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లఘించేలా ఉన్నాయని అసదుద్దీన్ తన పిటిషన్‌లో తెలిపారు.

ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు దాని ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని, ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని మహ్మద్ జావేద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా కేంద్రం తీసుకొచ్చిన వివా దాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం లభించిన విష యం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేస్తే వక్ఫ్ బోర్డు బిల్లు చట్టరూపం దాల్చనుంది. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో పలుచోట్ల ముస్లింలు నిరసనలు తెలిపారు.