calender_icon.png 16 January, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుసు కదా షురూ

07-08-2024 12:05:00 AM

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ తన నెక్స్ ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’తో అలరించబోతున్నాడు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్. ఇందులో టాకీ సీన్స్, మ్యూజిక్ నెంబర్స్ షూట్ చేస్తున్నారు. రాశీ ఖన్నా మొదటి రోజు షూటింగ్‌లో సిద్దూతో కలిసి జాయిన్ అయింది. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, వైవా హర్ష ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సిద్దూ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ అయ్యారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న ఈ ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.