calender_icon.png 19 October, 2024 | 9:29 AM

గులాబీ గుబాళించేలా..

19-10-2024 12:00:00 AM

ఇంటిబయట పెరట్లో నాటిన గులాబీ మొక్కలు ఇంటి అందాన్ని పెంచడంలో తోడ్పడతాయి. కొన్ని సందర్భాల్లో గులాబీ వాడిపోతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. గులాబీ మొక్క వాడిపోకుండా ప్రతిరోజూ నీరు పోయాలి. గులాబీ మొక్కకు కనీసం ఆరు గంటల సూర్యరశ్మి అందేలా చూడాలి. మొక్కకు ఎరువుగా మట్టిని కూడా వాడాలి. అప్పుడే వాడిన గులాబీ కొమ్మలన్నింటినీ కత్తిరించండి.

ఇది కొత్త కొమ్మలు ఏపుగా పెరిగేందుకు దోహదపడుతుంది. అంతేకాదు.. మొక్క అందంగా కనిపిస్తుంది. కీటకాల సంచారం వల్ల గులాబీ చెడిపోతోంది. అటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా మొక్కలను పరిశీలించి పురుగుల మందులను వాడాలి. వర్షకాలంలో గులాబీ మొక్కలు చల్లగా ఉంటాయి. అలాంటప్పుడు మొక్కకు ఎక్కువ నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ చిట్కాలన్నింటినీ పాటించడం ద్వారా గులాబీ మొక్కను ఎండిపోకుండా కాపాడుకోవచ్చు.