calender_icon.png 18 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్ చేరిన తొలి అథ్లెట్‌గా

06-08-2024 02:38:32 AM

పారిస్: భారత అథ్లెట్ అవినాశ్ సేబుల్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో అవినాశ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈవెంట్‌లో హీట్ రేసులో బరిలో దిగిన అవినాశ్ గమ్యాన్ని 8 నిమిషాల 15.43 సెకన్లలో చేరి ఐదో స్థానంలో నిలిచాడు. 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన తొలి భారత అథ్లెట్‌గా అవినాశ్ రికార్డులకెక్కాడు.

ప్రతీ హీట్స్ నుంచి తొలి ఐదు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు మెడల్ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. టిన్‌డౌఫ్ట్ (8 నిమిషాల 10.62 సెకన్లు), ఫైర్ వూ (8 నిమిషాల 11.61 సెకన్లు), కిబివోట్ (8 నిమిషాల 12.02 సెకన్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణం నెగ్గిన అవినాశ్..  అందరి దృష్టిని ఆకర్షించాడు.