calender_icon.png 9 January, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంచన4లో డెవిల్‌గా..

01-01-2025 12:00:00 AM

ఆ మధ్య కాలంలో వరుస ఫ్లాపులను ఎదుర్కోవడంతో పూజా హెగ్డే.. కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఒక్కటంటే ఒక్క ప్రా జెక్ట్ కూడా ఆమె వద్దకు వెళ్లింది లేదు. అంతా ఆమె పని అయిపోయిందని భావించారు. కానీ కొంతకాలానికే ఆమె తిరిగి వరుస అవకాశాలతో దూసుకెళుతోంది.

ముఖ్యంగా కోలీవు డ్‌లో ఇప్పటికే విజయ్, సూర్య చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ‘కాంచన పూజానే హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. రాఘవ లారెన్స్ స్వీయ దర్శక త్వం వహిస్తూ నటించిన చిత్రం ‘ముని’.

ఇది మంచి సక్సెస్ సాధించడంతో వరుసగా ‘కాంచన’,  ‘కాంచన 3’ తీసి మంచి హిట్ కొట్టారు. ప్ర స్తుతం ‘కాంచన 4’ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కథ కూ డా పూర్తుందట. ఈ చి త్రంలోనే పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోందట. ఈ సినిమా లో ఆమె డెవిల్ రోల్ ను పోషించనుందట. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది.