calender_icon.png 16 January, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణుడు కాలుచాచినంతనే బండి ఎగిరిపోయింది

21-12-2024 12:00:00 AM

పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్

వ్ళ్ళు విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో

పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు

కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి

వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై

ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం

మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం

ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్ (తమిళ)

గోదా గోవింద గీతం

కీచకీచు పక్షుల కిలకిలల కలకలల తెల తెల్లవారు 

గోపుర శిఖరాల శంఖారావములు జనుల పిలుచు

మాయమాత పూతన స్తనవిషప్రాణముల పీల్చినాడు

కాలు జాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు

క్షీర సాగరశయను యోగనిద్రలో లోకాల కల్పించినాడు

యోగిహృధ్యానగమ్యు మునుల మనములమనెడువాడు

ఎక్కడ కదులునోనయని ఎడదపట్టి రుషులు లేచినారు

పుళ్ళుం= పక్షులు కూడా, శిలమ్బిన కాణ్= కూయుచున్నవి కదా, పుళ్ళరైయన్= గరుడ వాహనుని, కోయిలిల్= కోవెలలో, వ్ళ్ళు= తెల్లని, విళి శంగిన్= ఆహ్వానిస్తూ మోగే శంఖపు, పేరరవం= పెద్ద శబ్దమును కూడా, కేట్టిలైయో= వినబడడం లేదా, పిళ్ళాయ్!= ఓ చిన్నారీ, ఎళుందిరాయ్= లేవమ్మా, పేయ్= పూతన, ములై= స్తనములోని, నంజుండు= విషం తీసుకుని, కళ్ళచ్చగడం= కృత్రిమ శకటపు, కలక్కళియ= కీళ్లు విరిగేట్టు, క్కాలోచ్చి= కాలు చాచి ధ్వంసం చేసి, వెళ్ళత్తరవిల్= పాల సముద్రంలో శేష శయనంపై, తుయిల్ అమరంద= యోగనిద్రలో అమరియున్న, విత్తినై= జగత్కారణ భూతుడైన, ఉళ్ళత్తు క్కొండు= తమ మనసులో ధ్యానించి, మునివర్గళుం= మునివరులు, యోగిగళుమ్= యోగివరులు, మెళ్ల= మెల్లగా, ఎళుందు= లేచి, అరి ఎన్ఱ= హరి హరి హరి అనే, పేరరవం= పెద్దధ్వని, ఉళ్ళం పుగుందు= మాలో ప్రవేశించి, కుళిరుందు= చల్లబరిచింది.

ఆకాశం అంటే విస్తరించిన భగవత్తత్త్వం. అక్కడ రెండు రెక్కల పక్షులు విహరిస్తున్నా యి. పొద్దున్నే కిలకిల రావాలతో తెల్లవారిందని సూచిస్తూ జీవరాశిని లేపుతున్నాయి. పక్షులు అరుస్తున్నాయ్. “జ్ఞానం, దానికి ఉచితమైన ఆచరణ అనేవే రెండు రెక్కలు” అంటు న్నారు చినజీయర్ స్వామి. భగవత్తత్త్వంలో విహరించే మహానుభావుల పలుకులు, మన ల్ని అజ్ఞానంలోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే.

“ఓ చిన్నారి అమ్మాయీ! పక్షులన్నిటికీ రాజు గరుడుడు. ఆయనకు స్వామి విష్ణువు. ఆయన ఆలయంలో తెల్లని శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా” అని గోపిక పిలుస్తున్నది. తెల్లవారిందనడానికి మరో ప్రమా ణం చూపుతున్నది. అక్కడి దీపకాంతి శంఖం ఊదేవాడి బుగ్గలపై పడి మెరుస్తుందని గోద మ్మ ఆలయ సన్నివేశాన్ని మన ముందుంచుతున్నారు. శంఖం ఓంకార రవం చేస్తుంది. ప్రతి జాముకీ వినిపించే ధ్వనే ఇది. ఇంకా తెల్లవారలేదేమో అన్నట్టు కళ్లు మూసుకునే ఉం ది. అందుకే, “మేలుకో” అంటున్నది బయటి గోపిక. “మునులూ, యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటున్నారు. అదీ వినిపించడం లేదా?” ఇక్కడ మూడుసార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

అహంకారమే విషం

పూతన స్తనాలకు అంటిన విషాన్ని ఆరగించాడు.-ప్రకృతి మనకు ఇచ్చే అహం- అనే విషాలను హరించే హరీ.. అని జ్ఞానులు తలుస్తున్నారు. 

శ్రీకృష్ణుడుని తల్లి యశోదమ్మ ఒక బండి కింద పడుకోబెట్టింది. కంసుడు పంపితే శ్రీకృష్ణుని సంహరించాలని ఒక అసురుడు బండి పై ఆవహించాడు. ఆ పిల్లవాడు కాలు చాచినంత మాత్రంతోనే బండి ఎగిరిపోయింది. అసురుడి కాలం తీరింది. పాపపుణ్యాల చక్రాలమీద నడిచే బండి మన శరీరం. మనల్ని నడిపించే పరమాత్మ పాదాల కింద మన శరీరం అనే బండి పెట్టి ‘చరణౌ శరణం ప్రపద్యే’ అంటే చాలు,- మనకు అంటిన పుణ్య-పాప సంపర్కాన్ని హరించి వేస్తాడు హరీ.

“అందరికీ ఆధారమైన ఆది పురుషుడీతడు” అని అన్నమయ్య మరో కీర్తనలో “హరి అంటే పాపాలు హరి పోతాయని” అన్నాడు. “పంకజభవునకును బ్రహ్మపద మొసగెను యీతుడు” అనీ అంటాడే.

జ్ఞానాన్ని పొంది దానిని ఆచరించిన వారే తత్తోపదేశం చేయగలుగుతారు. తెల్లవారుతున్నదని ముందే తెలుసుకుని నిద్రలేచి ఇతరులను మేల్కొల్పేవి పక్షులు. తాము భగవదనుభవం చేసి తమ వాక్కుల ద్వారా ఇతరులకు కూడా భగవదనుభవం కలిగించడానికి మేల్కొల్పే వారు జ్ఞానులు. “పక్షులు జ్ఞానానికి మార్గదర్శకులు, ప్రేరకులు” అని చెప్పే అద్భుత వ్యాఖ్యానాన్ని శ్రీ భాష్యం వారు వివరించారు.