calender_icon.png 5 February, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సుప్రీం’ ఆదేశాల మేరకే..

05-02-2025 02:24:38 AM

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

  • ఎస్సీ వర్గీకరణపై దేశానికి రోడ్ మ్యాప్ ఇస్తాం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారని, అది సాధార ణమైన అంశమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొట్టిపడేశారు. అసెంబ్లీలోని కమిటీ హాలులో మంగళవారం సీఎం మీడియాతో కాసేపు చిట్‌చాట్ నిర్వహించారు.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారని, ‘కేటీఆర్ కామెంట్లపై మీ స్పందన ఏంటి ?’ అని మీడి యా ప్రతినిధులు ప్రశ్నించగా సీఎం స్పం దించారు. ‘సిరిసిల్లలో ఉప ఎన్నిక వస్తుందా ? అక్కడి ఎమ్మెల్యే కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటారా?’ అని తనదైన శైలిలో జవాబిచ్చారు.

దేశంలో వందశాతం శాస్త్రీయతతో కులగణన చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలు 56 శాతం, ఎస్సీలు 17.46 శాతం ఉన్నారని.. మొత్తంగా 73.5 శాతం ప్రజల ఆకాంక్ష లు నెరవేరుస్తామని వెల్లడించారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, మంత్రి వర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. తాము క్రీమిలేయర్‌ను మాత్రం తిరస్కరిస్తున్నామన్నారు. రాజకీయాల కోసం కులగణ న చేయలేదని, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే తమ సంకల్పమన్నారు.

అదేం సర్వేనో..? ఎవరు చేశారో..?

బీఆర్‌ఎస్ హయాంలో నిర్వహించిన స మగ్ర కుటుంబ సర్వేపై మీడియా అడిగిన ప్ర శ్నలకు సీఎం సమాధానమిస్తూ.. ‘అదేం సర్వేనో.. ఎక్కడి సర్వేనో.. ఎవరు చేశారో.. అసలా నివేదిక ఎక్కడుందో ఎవరికీ తెలియ దు’ అన్నారు. ఆ ప్రభుత్వం కనీసం సర్వే నివేదికను క్యాబినెట్ ముందు పెడితే బాగుండేద ని, ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ సభ్యుడిగా చట్టసభకే రాని వారి గురించి మాట్లాడడం దండగ అ ని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ చురకలంటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఎప్పటికైనా దిక్సూచిగానే ఉంటుందని స్పష్టం చేశా రు. కులాల వారీగా కొన్నిపార్టీలు, సంఘాల నేత లు జనాభా వెల్లడించడంపై సీఎం స్పందించారు.

వాటికి ఏ ఆధారం ఉంటుందని ప్ర శ్నించారు. అలా చెప్పేవారి ప్రకారం జనాభాను లెక్కిస్తే జనాభా 200 శాతం దాటు తుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభు త్వం యావత్ దేశానికే రోడ్ మ్యాప్ ఇస్తుందన్నారు.

తద్వారా కేంద్ర ప్రభుత్వంపైనా ఒ త్తిడి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించిన ని యోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా 88 సీట్లలో 30 సీట్లను (33 శాతం) బీసీలకే కేటాయించమాన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే కులగణన చేపట్టిందన్నారు.