calender_icon.png 11 January, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా చేసినోళ్లకు చేసినంత!

23-07-2024 01:12:14 AM

  • జనగామ ఇందిరమ్మ కాలనీలో ఆక్రమణల పర్వం 
  • ఆక్రమిత స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు 
  • కన్నెత్తి చూడని అధికారులు

జనగామ, జూలై 22 (విజయక్రాంతి): జనగామ పట్టణంలోని ఓ వార్డు అది.. పట్టణ శివారులో ఉన్న ఆ ప్రాంతం ఓ గ్రామంలా కనిపిస్తుంది.. అధికారులు పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్పటికీ ఆ కాలనీకి మాత్రం వెళ్లరు.. జిల్లాకేంద్రానికి దూరంగా, జాతీయ రహదారికి అవు తలి వైపున ఉంటుంది.. ఇంకేముంది అక్కడ కొందరు అక్రమార్కులు పాగా వేశా రు.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా సాగుతోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. జనగామ జిల్లాకేంద్రం శివారులోని కళ్లెం, పెంబర్తి గ్రామాలకు సమీపంలో 163వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న తంతు ఇది. 

367 మందికి కేటాయింపు 

2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో ఫేస్‌లో ఇక్కడ 367 మందికి ప్లాట్లు ఇ చ్చారు. ఇందులో నిర్మాణాలు మొదలుపెట్టిన వారికి 25 బస్తా ల సిమెంట్‌తోపాటు కొన్ని బిల్లు లు ఇచ్చారు. చాలావరకు నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులు నివాసం ఉం టుండగా.. కొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొందరు అక్రమా ర్కులు అధికారులను మచ్చిక చేసుకుని కబ్జాలకు పాల్పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వం 367 ప్లాట్లు మాత్రమే కేటాయించగా.. అదనంగా మరో వంద వరకు ప్లాట్లు వెలిశాయి.

ఈ ప్రాంతంపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించేశారు. మౌలిక వసతులైన పాఠశాల, ఆస్పత్రి, అంగన్ వాడీ వంటి నిర్మాణాలతోపాటు రోడ్డు కోసం విడిచిపెట్టిన ఏ స్థలాన్నీ వదలడం లేదు. ఒకరిని చూసి మరొకరు కనిపించిన స్థలాలను పోటీ పడి కబ్జా చేస్తున్నారు. ఖాళీ స్థలాల్లో ఇప్పటికే 30 వరకు నిర్మాణాలు చేపట్టగా.. మరికొన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రధాన రహదారి కోసం వదిలిన స్థలాల్లో కొందరు కనీలు నాటడం గమనార్హం. 

ఇచ్చిన దానికంటే ఎక్కువ

ప్రభుత్వం 80 గజాల స్థలాన్ని లబ్ధిదారులకు కేటాయించగా, కొందరు మరింత స్థలా న్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ కబ్జాపర్వాన్ని కొందరు వ్యక్తులు వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా రు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న ట్టు ఐదారుగురు వ్యక్తులు కలిసి కబ్జాల తతంగం నడిపిస్తుండగా, కొందరు మునిసిపల్ అధికారులు వీరికి సహకరిస్తున్నట్టు తెలిసింది. ఓ గ్రామంలో పదెకరాల స్థలం ఉన్న ఆసామి ఇందిరమ్మ కాలనీలో ఓ ప్లాటు కొన్నాడు. తరువాత మరో 80 గజా ల స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు.

ఇలా అడ్డూఅదుపు లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆక్రమిత స్థలాల్లో నిర్మించిన పలు ఇండ్లకు మునిసిపల్ అధికారులు ఇంటి నంబర్లతోపాటు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు సమాచారం. కబ్జా ల వ్యవహారంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టిం చు కోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇంది రమ్మ కాలనీని సందర్శించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.

 ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఇచ్చిన విషయం నా దృష్టికి రాలేదు. చట్ట ప్రకారం పట్టాలు ఉన్న వారికే నం బర్లు కేటాయించాం. ఆక్రమిత స్థలా ల్లో ఇండ్లు నిర్మించినట్టు ఎవరైనా ఫి ర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల్లో మునిసిపల్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు రుజువు అయితే చర్యలు తప్పవు.       

 -వెంకటేశ్వర్లు, కమిషనర్, జనగామ మునిసిపాలిటీ