న్యూ ఢిల్లీ: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సుధాకర్ ఆదివారం సాయత్రం కార్యకర్తలు, అభిమానులకు నిర్వహి ంచిన విందు, మద్యం పార్టీపై కాంగ్రె స్, ఇతర పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం కోసం కార్యకర్తలు ఎగబడటంతో పో లీసు బందోబస్తు నడుమ క్యూ లైన్ లో మద్యం బాటిళ్లను పంపిణీ చే యాల్సి వచ్చింది. సోషల్ మీడియా లో ఈ క్యూలైన్ల ఫొటోలు, వీడియో లు వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే మాట్లా డుతూ.. ‘చూడండి ఇది బీజేపీ సంస్కృతి’ అంటూ పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై మీరెలాంటి చర్యలు తీసు కుంటారు అని డీకేని ప్రశ్నించగా.. ముందుగా బీజేపీ జాతీ య అధ్యక్షు డు, పార్టీ నేతలు దీనిపై ఏం సమాధానం చెప్తారో చూద్దామన్నారు.
నాకు సంబంధం లేదు..
ఎంపీ సుధాకరణ్‌ను వివరణ కో రగా మద్యం పంపిణీకి.. నాకు ఎలా ంటి సంబంధం లేదన్నారు. పార్టీ నేతలు మద్యం పంపిణీ చేపట్టి ఉండవచ్చని తెలిపారు.