calender_icon.png 29 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది

28-04-2025 12:51:30 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

చిలుకూరు, ఏప్రిల్ 27: ఈ దేశంలో పేదరికం ఉన్నంతకాలం ఎర్రజెండా పార్టీలు ఉంటా యని  సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో కామ్రేడ్ దొడ్డ నరసయ్య భవనంలో (సిపిఐ పార్టీ కార్యాలయం) శాఖ మహాసభలు ఘనంగా నిర్వహించారు.

ఈ మహాసభలకు పోరెడ్ల ఉపేందర్, తాళ్లూరు రామారావు అధ్యక్షతన జరిగిన సభకి హాజరై మాట్లాడుతూ, దేశంలో పేదరిక రోజు రోజుకు పెరిగిపోతూ సంపద కొద్ది మంది చేతులు బందీగా మారిందని అది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో కమ్యూనిస్టు పార్టీలు మరింత బలపడాలని దానికోసం కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని కోరారు.

గ్రామంలో రెండు నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఒక్కొక్క కమిటీకి 15 మందిని ఎంపిక చేసి మొదటి డివిజన్ కార్యదర్శిగా బెజవాడ వినోదు, సహాయ కార్యదర్శిగా కడారి నరేష్, రెండో డివిజన్ కార్యదర్శిగా తాళ్లూరు వెంకటయ్య, సహాయ కార్యదర్శిగా అలవాల రాజేష్ ను ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో మండల  కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చేపూరు కొండలు, చిలుకూరు శాఖ కార్యదర్శి లు ఎస్ కే సాయి బెల్లి, సిలువేరు ఆంజనేయులు, మండల నాయకులు పిల్లుట్ల కనకయ్య, తాళ్లూరు మట్టయ్య, పెద మల్లయ్య మహమ్మద్ ఖాజామీయా, బెజవాడ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.