calender_icon.png 29 October, 2024 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేనల్లుడి కోసం కృష్ణుడిగా..

29-10-2024 12:10:44 AM

మహేశ్‌బాబుని కన్నయ్యగా చూడాలనేది అభిమానుల కల. అది మరికొద్ది రోజుల్లో నెరవేరనుంది. ఎప్పటి నుంచో మహేశ్ శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ శ్రీకృష్ణుడి పాత్రలో మహేశ్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. అశోక్ గల్లా, మానసి వారణాసి జంటగా ‘దేవకీ నందన వాసుదేవ‘ చిత్రం రూపొందింది. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించారు.

ఈ సినిమాలోనే మహేశ్ కిట్ట య్యగా కనిపించున్నారట. క్లుమైక్స్‌లో శ్రీకృష్ణుడికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయట. ఆ పాత్రకు మహేశ్ అయితే సూట్ అవుతారని భావించిన చిత్రబృందం ఆయనను ఒప్పించి షూట్ చేసిందట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.