- నవంబర్‌లో ఎన్నికలకు సుముఖంగా లేని ఈసీ
- నేడు కేజ్రీవాల్ రాజీనామా!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన వెంటనే రాజీనామా ప్రకటన చేయడం, ముందుస్తుకు వెళ్తాం అని ప్రకటించడంతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. మంగళవారం ఢిల్లీ ఎల్‌జీని కలిసి కేజ్రీవాల్ రాజీనామా పత్రం అందజేయనున్నారు. అయితే మహారాష్ట్రతో కలిసి నవంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న ఆప్ ఆశలపై ఎలక్షన్ కమిషన్ నీళ్లు చల్లింది. ఢిల్లీలో ముందుస్తు ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని ఈసీ అధికారులు వెల్లడించారు. పోల్‌బాడీ ప్రకారం ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించేటప్పుడు అనేక అంశాలు పరిగిణలోకి తీసుకుంటారు. ఒక పార్టీ లేదా ప్రభుత్వం అడిగిన వెంటనే ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వం ఉండటంతో పాటు అది స్థిరంగా ఉంది. ఈ కారణాలను చూపించి ఈసీ ముందస్తుకు వెళ్లకపోవచ్చు.