calender_icon.png 18 October, 2024 | 1:30 PM

ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లే!

27-07-2024 12:46:11 AM

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సమయం జులై 31తో ముగియనుంది. గడువు పెంచే అవకాశాలు ఈసా రి తక్కువేనని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇటీవలి వరకు ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయం టూ పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గడువు పెంచక తప్పదనే విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, ఈ సమస్యను పరిష్కరిం చడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్వయంగా రంగంలోకి దిగింది. ఎలాంటి లోపాలు, జాప్యం లేకుండా తగి న చర్యలు తీసుకుంది. దీంతో బుధవా రం నుంచి ఐటీ పోర్టల్ వేగంగా ఉన్నట్లు పలువురు వెల్లడించారు. టీడీఎస్ జనరేషన్, ఫారమ్-16 సర్టిఫికెట్ సహా ఇతరత్రా సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లు సీబీడీటీ వర్గాలు తెలిపాయి.

దీంతో పోర్టల్ వేగంగా పనిచేస్తుందని వెల్లడించాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 28 లక్షల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. ఎక్కడా జాప్యం చోటుచేసుకున్న దాఖలాలు వెలుగులోకి రాలేద ని తెలిపాయి.  గడువు ముగిసేవరకు కూడా ఇదే వేగంతో పోర్టల్ పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గడువు పొడిగించా ల్సిన అవసరం తలెత్తకపోవచ్చునని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. జులై 22 నాటికి 4 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి.

క్రితం ఏడాది ఈ సంఖ్య జులై 24 నాటికి నమోదైంది. జులై 23న ఒక్కరోజే 22 లక్షల ఐటీఆర్‌లను సమర్పించినట్లు సీబీడీటీ ఛైర్మన్ వెల్లడించారు. మరోవైపు ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. పన్ను చెల్లింపుదారుల్లో ఎవరికైనా సమస్యలు తలెత్తితే 1800 103 0025 లేదా 1800 419 0025 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయొచ్చు. Efilingwebmanag er@incometax.gov.inకు మెయిల్ ద్వారా కూడా సమస్యను తెలియజేయొచ్చు.