calender_icon.png 30 September, 2024 | 3:56 AM

పథకాలకు పాతర.. సీఎం ఫొటోలతో జాతర

29-09-2024 02:07:08 AM

మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి పథకాలకు పాతరేసి, ఫొటోలతో ఫోజులు కొడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల డీఎలకు దిక్కు లేదు, పీఆర్సీ గురించి ఊసులేదని మండిపడ్డారు. ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా మాటెత్తడం లేదని, అరకొర రుణమాఫీతో చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

రూ.4 వేల ఆసరా పెన్షన్ పెంపు ఎప్పటి నుంచి చేస్తారో చెప్పడం లేదన్నారు. మహిళలకు గృహజ్యోతి కింది రూ. 2500 హామీ అటకెక్కిందని, కల్యాణలక్ష్మీ,  తులం బంగారం జాడలేదన్నా రు. బతుకమ్మ చీరలను నిలిపేసి నేతన్నల బతుకుల్లో మన్నుపోశారని ఆవే దన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల కంటికి కునుకులేకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయం లో అక్టోబర్ 7 లోపు సీఎం ఫొటోలు పెట్టాలని ఆదేశాలు ఇవ్వడంపై మండిపడ్డారు.