calender_icon.png 19 January, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా వరకు అది పర్ఫెక్ట్

28-09-2024 12:00:00 AM

శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక చైతుతో నిశ్చితార్థం అయ్యాక శోభిత మరింత పాపులర్ అయింది. శోభిత ఏం మాట్లాడినా, ఏ ఫోటో పెట్టినా నెట్టింట వైరల్ అవుతున్నాయి. శోభిత నటించిన ‘లవ్ సితార’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని నేను కలలు కనలేదు.

వాటి కోసం ప్లాన్స్ వేసుకోలేదు. సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలు అనుకున్నా. అనుకున్నట్లే సింపుల్‌గా, ఫ్యామిలీ మధ్యలో జరిగింది. నా వరకు అది పర్ఫెక్ట్. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలని కనాలి అనుకునేదాన్ని. మాతృత్వంలోని అనుభూతిని నేను పొందాలి అనుకుంటాను. అలాగే నా తల్లిదండ్రు లు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తాను.

అం దుకే నేను ఎంత ఎదిగిన నాకు సంబంధిం చినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షం లో జరగాలిఅనుకుంటాను’ అని అన్నారు.   అయితే నాగచైతన్య గతంలో నటి సమంత రూత్ ప్రభుతో కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే 2021లో విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించడంతో అనేక రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత సమంత సినిమాలు, ఆధ్యాత్మిక యా త్రలతో వ్యక్తిగత లైఫ్ ను ఎంజాయ్ చేయగా.. చైతూ మాత్రం సైలెం ట్‌గా శోభితతో డేటిం గ్ చేసినప్పటికీ.. ఆవిషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు.